Tuesday, 3 November 2026

మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిన మాది పెనుతుపాను

హైదరాబాద్‌:మాది పెనుతుపాను మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది స్తిరంగా కొనసాగుతున్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మచిలీపట్నానికి ఆగ్నేయ దిశలో 380 కి.మీ., చెన్నైకి తూర్పు ఈశాన్య దిశలో 370 కి,మీ. దూరంలో ఇది కేంద్రీకృతమైంది. నైరుతి దిశగా పయనించి మరో 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉందని, కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ.వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉందని, కోస్తాంధ్ర తీరం వెండబి గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల వరకు మత్సకారులు వేలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ఓడ రేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *