Tuesday, 3 November 2026

రన్‌ ఫర్‌ ఇందియా… గోడపత్రిక ఆవిష్కరణ

హైదరాబాద్‌: దేశ సమగ్రత, ఐక్యత కోసం ఈ నెల 15న హైదరాబాద్‌లో తలపెట్టిన పరుగును విజయవంతం చేయాలని భాజపా సీనియర్‌ నేత దత్తాత్రేయ పిలుపునిచ్చారు. గుజరాత్‌లో నిర్మించనున్న సర్దార్‌ పటేల్‌ భారీ విగ్రహం గురించి దేశవ్యాప్తంగా అవగాహన కటట్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీలు, మేధావులు, పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రన్‌ ఫర్‌ ఇందియా…రన్‌ ఫర్‌ యూనిటీ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 15న ఉదయం 7 గంటలకు పీపుల్స్‌ ప్లాజాలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. నగర ప్రజలతో పాటు క్రీడాకారులు, కళాకారులు, వాద్యార్థులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని దత్తాత్రేయ కోరారు. ఇది నరేంద్రమోడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న కార్యక్రమం కాదని మరో నేత విద్యాసాగర్‌ రావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *