హైదరాబాద్: పధ్నాలుగేళ్ల నుంచి కేసీఆర్ ఏం చేశాడో దేశానికి తెలుసని తెరాస అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన చంద్రబాబు వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. తనకు అధికారం పోయింది తెరాస వల్లనేని చంద్రబాబు అన్నారు. తన గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. తనకు వ్యవసాయం ఉందని, ఫామ్ హౌస్‌లో ఎన్నో పనులుంటాయని, హైదరాబాదులో కూర్చుని చీకటి కుట్రలు చేసే అలవాటు తనకు లేదని కేసీఆర్ అన్నారు. అవకాశవాదం, నమ్మకద్రోహం లాంటివి చంద్రబాబుకే బాగా వర్తిస్తాయన్నారు. తెలంగాణను అబివృద్ధి చేశానంటున్న చంద్రబాబువి కల్లబొల్లి మాటలన్నారు. ఎవరి చరిత్ర ఏమిటో చర్చించుకునేందుకు, చంద్రబాబుతో బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. చంద్రబాబు తనతో మాట్లాడారని నిండు పార్లమెంటులో చిదంబరమే చెప్పారని గుర్తుచేశారు.




