Wednesday, 4 November 2026

రెండు ప్రాంతాల్లో ప్రత్యేక కమిటీలు : దిగ్విజయ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన అంశంలో సీడబ్ల్యూసీ తీర్మానం నిర్ణయమని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ తీర్మానమే అంతిమ నిర్ణయమని కాంగ్రెస్‌ వాదులందరికీ తెలుసని ..ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా దానికి కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో దిగ్విజయ్‌ మీడియాతో మాట్లాడుతూ రెండు ప్రాంతతాల్లో రెండు ప్రత్యేక కమిటీలు వేయాలనే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు. కొత్తగా ఏర్పాటయ్యే 2 ప్రత్యేక కమిటీలు పీసీసీ ఆధ్వర్యంలో పనిచేస్తాయని తెలిపారు. ప్రత్యేక కమిటీలపై సోనియా గాంధీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *