Wednesday, 4 November 2026

ప్రజాస్వామ్య విరుద్ధంగా రాష్ట్ర విభజన : విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు చక్రవర్తి

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా, దౌర్జన్యంగా వ్యవహరిస్తూ అప్రజాస్వామికంగా రాష్ట్ర విభజనకు పూనుకుంటోందని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు చక్రవర్తి ఆరోపించారు. ఈ రోజు ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్‌ నిర్వహించకుండా అందులోని 11 అంశాలపై మాత్రమే అభిప్రాయాలను తెలపాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటటి వరకు దేశంలో ఎక్కడా కూడా అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాలు విడిపోలేదని, తొలిసారిగా కింగ్రెస్‌ పార్టీ మాత్రమే ప్రజాస్వామ్య విరుద్ధంగా కొత్త విధానానికి తెరతీస్తోందని విమర్శించారు. స్పీకర్‌ విభజన బిల్లుపై రాజ్యాంగబద్దంగా ఓటు జరపాలని.. ప్రజాప్రతినిధులంతా బిల్లును వ్యతిరేకించాలని డిమాండ్‌ చేశారు. బిల్లును వ్యతిరేకించని నాయకులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *