Wednesday, 4 November 2026

కాలినడకన వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం :పాలకమండలిసమావేశంలోనిర్ణయం

హైదరాబాద్‌ : తితిదే పాలక మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరిగింది. జనవరి 11 వైకుంఠ ఏకాదశి నుంచి కాలినడకన వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం ఇవ్వాలని నిర్ణయించినట్లు తితిదే ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు తెలిపారు. 4.5 లక్షల కిలోల ఆవునెయ్యి, 4.4 లక్షల కిలోల రవ్వ కొనుగోలుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. వచ్చే విడత మనగుడి కార్యక్రమాన్ని 44 వేల ఆలయాలకు విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *