హైదరాబాద్: కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సభాహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ సీమాంధ్ర తెదేపా ఎమ్మెల్యేలు సభాపతికి నోటీసు ఇచ్చారు. సోమవారం బీఏసీ సమావేశం ఉంటుందని, ఓటింగ్ ఉండదని, తెలంగాణ బిల్లు సోమవారం సభలోకి వస్తుందని చెప్పడం శాసన సభ హక్కుల ఉల్లంఘనే అని వారు మండిపడ్డారు. రాష్ట్ర విభజన కోసం వచ్చిన దిగ్విజయ్‌కు పీసీసీ అధినేత బొత్స విందు ఇవ్వటం ఏమిటని నేతలు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. సీమాంధ్రలో అగ్ని గుండం సృష్టించి కాంగ్రెస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.




