ఇంటర్‌నెట్ డెస్క్, హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీకి వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ టికెట్ ఇస్తామని భాజపా వర్గాలు శనివారం వెల్లడింంచాయి. భాజపా అధికారంలోకి వస్తే కేంద్ర క్రీడల మంత్రి పదవిని ఆయనకు కేటాయిస్తామని తెలిపినట్లు సమాచారం. పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీయే స్వయంగా గంగూలీ పేరును సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ విషయంపై గంగూలీ స్పందిస్తూ తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. గత కొన్ని రోజులుగా తీరిక లేకుండా ఉన్నానని త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు.




