Wednesday, 4 November 2026

పొత్తులపై ఇప్పుడే చెప్పలేం: జవదేకర్‌

హైదరాబాద్‌: పొత్తులపై ఇప్పుడే చెప్పలేమని, ఎన్నికల తేదీల ప్రకటన తర్వాతే నిర్ణయిస్తామని భాజపా అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. రాష్ట్ర విభజన జరగాలి, సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించాలన్నారు. సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాసం పెట్టడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వారిపై కాంగ్రెస్‌ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని జవదేకర్‌ ప్రశ్నించారు. ఫిబ్రవరి లోపు జరిగే తుది సమావేశాల్లో తెలంగాణ బిల్లు తీసుకువచ్చేది అనుమానమేనన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *