Wednesday, 4 November 2026

ఆ జీవోను ఉపసంహరించుకోవాలి:కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌

హైదరాబాద్‌: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో పని చేస్తున్న స్పెషల్‌ ఆఫీసర్లను విధుల్లోనుంచి తొలగిస్తూ జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా రాజీవ్‌ విద్యామిషన్‌ డైరెక్టర్‌ ఉషారాణి
ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 743 స్పెషల్‌ ఆఫీసర్లను తొలగించడంపై వారు మండిపడ్డారు. బోధన అనుభవం లేనివారిని ఈ నియామకాల్లో భర్తీ చేసేందుకు కుట్రపన్నుతున్నారని తెలిపారు. ప్రస్తుతం స్పెషల్‌ ఆఫీసర్లుగా పనిచేస్తున్న వారినే వారి వారి స్థానాల్లో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *