హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును సమర్థిస్తూ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరు జిల్లా బాపట్లలో తెలుగు యువత నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బాపట్లలోని ఆమె ఇంటిని ముట్టడించి సమైక్యాంధ్ర నినాదాలతో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని విఙ్ఞప్తి చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఆందోళన కారులను చెదరగొట్టారు.




