Wednesday, 4 November 2026

హైదరాబాద్‌ నుంచి విమానాల రాకపోకలు ఆలస్యం

హైదరాబాద్‌ : కొచ్చితో పాటు ఉత్తరాధిని కూడా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో హైదరాబాద్‌ నుంచి పలు విమానాలు ఆలస్యంగా నగుస్తున్నాయి. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కొచ్చికి వోళ్లాల్సిన ఇండిగో విమానాన్ని నాలుగు గంటల నుంచి రన్‌ వే పైనే నిలిపివేశారు. వాతావరణం అనుకూలించాక మధ్యాహ్నం తరువాత విమానం బమలుదేరే అవకాశం ఉందని ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు. విమానం బయలుదేరే అవకాశం ఉందని ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు. దీంతో కొచ్చి వెళ్లాల్సిన 150 మంది అయ్యప్ప భక్తులు ఎయిర్‌ పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. తిరుగు ప్రయాణం టికెట్‌ బుక్‌ చేసుకున్న అయ్యప్ప భక్తులు దర్శనానికి ఆలస్యం కావడంతో పాటు, తిరుగు ప్రయాణానికి సమయం సరిపోదంటూ ఎయిర్‌లైన్స్‌ అధికారులతో వాగ్వాదానికి దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *