హైదరాబాద్ : వాయిదా తర్వాత శాసనసభ సమావేశం తిరిగి ప్రారంభమైన అంతలోనే మళ్లీ రేపటికి వాయిదా పడింది. సభలో సీమాంధ్ర ఎమ్మెల్యేల ఆందోళర కొనసాగింది. వారు బిల్లు ప్రతులు చించి పోడియం వైపు విసిరారు. సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. సిబ్బంది బల్లలపైకి ఎక్కి సభ్యులు ఆందోళనకు దిగారు. బల్లలపై నిలబడిన బిల్లు ప్రతులను చించి స్పీకర్ కుర్చీ వైపు విసిరారు. బిల్లుపై చర్చ ప్రారంభించాలంటూ ఉపసభాపతి భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేత చంద్రబాబును కోరారు. చర్చను ప్రారంభించేందుకు స్పీకర్ ప్రయత్నిస్తుండగా సభ్యులు గంట మోగించారు. గందరగోళం కారణంగా స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.




