Wednesday, 4 November 2026

ఆస్కార్‌ విజేత జోన్‌ ఫోన్‌ టైన్‌ మృతి

కాలిఫోర్నియా: ఆస్కార్‌ విజేత జోన్‌ ఫోన్‌టైన్‌ (96) ఆదివారం ఉదయం కార్మెల్‌లోని ఆమె స్వగృహంలో మృతి చెందినట్లు సన్నిహితులు తెలిపారు. నిద్రలోనే ఆమె కన్ను మూశారని వారు తెలిపారు. ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ థ్రిల్లర్‌ ‘సస్పీషన్‌’ లో నటనకు గాను ఫోన్‌టైన్‌ అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆమె రెబెక్కా, ద ఉమన్‌, జేన్‌ ఐర్‌, బార్న్‌ టు బి బ్యాడ్‌ తదితర సినిమాల్లో నటించారు. ఫోన్‌టైన్‌ సోదరి ఒలీవియా డీ హావిలాండ్‌ కూడా నటిగా పేరుతెచ్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *