హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై మరోకారు పెనుప్రమాదం తప్పింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చీబౌలి వైపు వెళ్తున్న ఓ కారు యజమాని కారులోంచి కిందకు దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. గత రాత్రి కారు, మోటర్ సైకిల్ ఢీ కొని దంపతులు మృత్యువాత పడ్డ చోటే ఇవాళా ప్రమాదం జరగడం గమనార్హం




