Wednesday, 4 November 2026

అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద పాత్రికేయుల ధర్నా

హైదరాబాద్‌: అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆంక్షలు విధించడం ఆందోళనకు దారి తీసింది. మీడియా పాయింట్‌ వద్ద తయపై కొందరు పాత్రికేయులు దాడికి యత్నించారంటూ వైకాపా ఎమ్మెల్యేలు నిన్న స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ రోజు అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనిపై పాత్రికేయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే బారికేడ్లు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అక్కడే ధర్నాకు దిగారు. పాత్రికేయ సమావేశాలను బహిష్కరించారు. ఆందోళనకారులను పోలీసులు తోసివేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అక్కడికి చేరుకున్న అధికార విపక్ష సభ్యులు జర్నలిస్టులకు మద్దతు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *