Tuesday, 3 November 2026

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

మల్కాజ్‌గిరి(హైదరాబాద్‌): మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సర్ధార్‌ పటేల్‌ నగర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై బాదితురాలి తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… ఈ నెల 11వ తేదీ సాయంత్రం అక్కతో కలిసి ట్యూషన్‌కు వెళ్లిన నాలుగేళ్ల చిన్నారికి ట్యూషన్‌ మాషార్టు సోదరుడు చాక్లెట్లు ఆశ చూపి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి, తాత శబరిమలై నుంచి ఈ రోజు ఉదయం ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *