హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ బలహీర పడడానికి కాంగ్రెస్ అధిష్ఠానము కారణమని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ … ముఖ్యమంత్రి పార్టీ పెడతారని తాను అనుకోవడం లేదన్నారు. సీఎం పార్టీ పెడతారని జేసీ దివాకర్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి ఆశాభావంతో ఉన్నారన్నారు. ఒక్క తప్పు జరిగినంత మాత్రాన సోనియాను నాయకత్వం నుంచి తప్పుకోవాలనడం సరికాదన్నారు. కడపలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ఆజాద్‌కు లేఖ రాసినట్లు చెప్పారు.




