హైదరాబాద్: తొమ్మిది నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకూ చదివే విద్యార్థులు తమ భవిష్యత్ చదువులను ఎంపిక చేసుకోవడం కోసం ఎస్కేవ్ వెలాసిటీ పేరుతో వినూత్నమైన పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రముఖ విద్యాసంస్థ ఫిట్టీ ప్రకటించింది. యూఎన్‌ఏ యూనిక్వెన్ట్, ఫిట్టీ సంయుక్తంగా చేపడుతున్న ఈ పరీక్షకు విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా హాజరు కావచ్చునని ఫిట్టీ హైదరాబాద్ శాఖ సంచాలకుడు ఆనందరామన్ తెలిపారు. మూడు భాగాలుగా జరిగే ఈ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు కేవలం ఇంజినీరింగ్, మెడిసిన్‌లనే కాకుండా ఇతర రంగాల్లో ఉన్న అవకాశాలను సైతం తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఆన్‌లైన్ ద్వారా పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు జనవరి 2 లోపు రిజిష్టర్ చేసుకుంటే అదే నెల 4 నుంచి 10 వరకు పరీక్ష రాసే అవకాశం ఉంటుందని ఆనంద రామన్ చెప్పారు. దీనికి ఏవిధమైన రుసుమూ చెల్లించనవసరం లేదన్నారు.




