Tuesday, 3 November 2026

దేవయానిపై అమెరికా చర్యకు నిరసనగా విద్యార్థుల ప్రదర్శన

విజయవాడ(సబ్‌ కలెక్టరేట్‌): అమెరికాలో దేవయాని ఖోబ్రగాడే అరెస్టును నిరసిస్తూ విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద శనివారం బిషన్‌ అజరయ్య కళాశా విద్యార్థులు వివిధ పార్టీల నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నేత శివాజీ మాట్లాడుతూ… భారత ప్రభుత్వం తక్షణమే ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని అమెరికా పంపి అక్కడి ప్రభుత్వానికి తమ నిరసన, ఆందోళనను తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం విద్యార్థులు నాయకులతో కలిసి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలోని ఏవో సూర్యారావుకు వినతిపత్రం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *