Tuesday, 3 November 2026

రాయలసీమకు జరిగిన అన్యాయం పై ఉద్యమిస్తాం: కె.ఇ. కృష్ణమూర్తి

హైదరాబాద్‌: తెలంగాణ బిల్లు రాయలసీమకు జరిగిన అన్యాయంపై ఉద్యమం చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కె.ఇ.కృష్ణమూర్తి అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను సభలో వినిపించే స్వేచ్ఛ చంద్రబాబు తమకు కల్పించినట్లు చెప్పారు. భాజపాతో కలిసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. హైదరాబాద్‌లో విభజన… ఢిల్లీ సోనియా భజనతో జగన్‌ తరిస్తున్నారని విమర్శించారు. సమైక్య పక్షమో, సోనియా పక్షమో జగన్‌ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారమే పరమావధిగా జగన్‌ ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. విభజన జరిగితే మూడేళ్లలో రాయలసీమ ప్రత్యేక ఉద్యమం తీవ్రంగా వస్తుందని కె.ఇ. కృష్ణమూర్తి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *