Tuesday, 3 November 2026

హైదరాబాద్‌ను రెండో రాజధాని చేయాలి: సోమిరెడ్డి

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని తెదేపా సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పార్టీలకు అతీతంగా అందరూ ఈ అంశం పై ముందుకు రావాలని కోరారు. విభజన బిల్లు తప్పుల తడకగా ఉంటే ఎవరూ పట్టించుకోరేమిటని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అన్ని పార్టీల నేతలు రాష్ట్రపతి అపాయింట్‌ మెంట్‌ తీసుకుని, హైదరాబాద్‌ ప్రాముఖ్యతను కాపాడాలని రాష్ట్రపతిని కోరిలని సూచించారు. విభజన జరిగిన మరుక్షణం హైదరాబాద్‌ పై ఎలాంటి చట్టపరమైన హక్కు లేకుండా పోతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *