జోహెనెన్‌బర్గ్: దక్షిణాఫ్రికా పై జరుగుతున్న తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత యువ ఆటగాడు విరాట్ కోహ్లి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 193 బంతులాడిన కోహ్లి 9 ఫోర్ల సాయంతో 96 పరుగులు చేసి డుమిని బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీకి చేరువలోకి వచ్చి ఔట్ కావడంతో నిరాశగా వెనుదిరిగాడు.




