హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ఇవాళ కావాల్సింది పెద్దల ఒప్పందం కాదని…ప్రజల ఒప్పందమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ప్రజల అభిప్రాయం వినని పార్టీలకు కాలం చెల్లిందని కాంగ్రెస్ అధిష్ఠానానికి చెప్పినట్లు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని శాసన సభ్యులంతా గౌరవించాల్సిందేనని సూచించారు. మెజారిటీ శాసన సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా అభిప్రాయం చెబితే రాష్ట్రపతి ముందుకు వెళ్లారని అన్నారు. సీమాంధ్రప్రాంత ఎమ్మెల్యేలంతా సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నారని పునరుద్ఘాటించారు. ఇప్పటి వరకు గాంధేయవాదంతో నడిచిన ఉద్యమం ..ఇక నుంచి గాండీవవాదంతో వెళ్తుందని అన్నారు.




