Tuesday, 3 November 2026

ఈనాడు స్థిరాస్తి ప్రదర్శనకు విశేష స్పందన

హైదరాబాద్‌: ఈనాడు ఆధ్వర్యంలో నగరంలో ఏర్పాటు చేసిన స్థిరాస్తి ప్రదర్శనకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ప్రముఖ నిర్మాణరంగ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అభివృద్ధి చెందుతున్న గృహ సముదాయాల ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి సమాచారం లభిస్తుండటంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గృహ రుణాలకు సంబంధించిన సమాచారం కోసం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శన ఆదివారం కూడా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *