హైదరాబాద్ : ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల్లో సీమాంధ్ర జిల్లాల వూసే లేదని తెదేపా నేత దేవినేని ఉమ అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్గోండ , కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు కోసం ఉత్తర్వులు ఇచ్చామని ఉమ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సీమాంధ్రల గొంతు కోసి మంత్రి శ్రీధర్ బాబు ప్రాంతానికి మాత్రమే ఉత్తర్వులు ఇస్తారా? అని మండిపడ్డారు. కేంద్రం ఉత్తర్వులను సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి , మంత్రి శ్రీధర్ బాబు ఎందుకు దాచారని నిలదీశారు. సీమాంధ్ర రైతులు ఈ దేశంలో పౌరులు కాదా? అని ప్రశ్నించారు.




