హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా సశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రధాన రహదారిపై తెదేపా శ్రేణులు రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న వారిని తమ రాజకీయ స్వలాభం కోసం కేంద్ర ప్రభుత్వం విభజించడం దారుణమన్నారు. విభజనకు కారకులైన సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్ మాస్క్‌లతో ఉన్న వారిని నిందిస్తూ నిరసన తెలిపారు. రాస్తారోకోతో ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.




