కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపిన దిగ్విజయ్‌

ఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ ఆమ్‌ఆద్మీ పార్టీ సమన్వయ కర్త కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆమ్‌ఆద్మీ ప్రకటించిన అనంతరం దిగ్విజయ్‌ మీడియాతో మాట్లాడుతూ… అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారని ప్రశంసించారు.