Wednesday, 4 November 2026

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి : రాష్ట్రాపతిని కోరిన శైలజానాధ్‌

హైదరాబాద్‌ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సమక్షంలో మంత్రి శైలజానాథ్‌ సమైక్యగళం వినిపించారు. నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి అనంతపురం వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని పరిస్థితులు బాగా తెలిసిన వ్యక్తిగా ప్రజల ఆకాంక్షలు గుర్తించాలని విఙ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచటం ద్వారానే తెలుగు వారి ప్రయోజనాలు కాపాడటం సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని రాష్ట్రపతికి అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *