హైదరాబాద్ : కర్నూలులో హంద్రినీవా ఎత్తిపోతల పథకం మొదటి పంపింగ్ స్టేషన్ను కేసీ కాలువ రైతులు ముట్టడించారు. అక్కడి రెండు మోటర్లను ఆపివేశారు. కేసీ కాలువకు నీరు నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. తుంగభద్ర నీటిని అనంతపురం తరలించడం, కృష్ణా నది నీటిని మళ్లించడంపై రైతులు ఈ ఆందోళన చేపట్టారు.




