హైదరాబాద్ : కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ వైద్యుల నిర్వాకంపై సూపరింటెండెంట్ బుద్ధ విచారణకు ఆదేశించారు. ఓ జూనియర్ వైద్యుడి పుట్టినరోజు సందర్భంగా 20 మంది మెడికోలు ప్రభుత్వాసుపత్రి తల్లి పిల్లల విభాగంలో మందు పార్టీ చేసుకున్నారు. భవనం టెర్రన్‌పై మద్యం సేవించి మద్యం మైకంలో అరుపులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. విషయాన్ని మీడియాకు చేరవేయడంతో జూనియర్ డాక్టర్లు మీడియాకు చిక్కారు.




