హైదరాబాద్ : కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు నేడు కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని టెక్స్టైల్ పార్కును సందర్శించారు. కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్ల మండలాన్ని టెక్స్టైల్స్ జోన్‌గా ప్రకటించి విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని కావూరిని కోరారు.




