Tuesday, 3 November 2026

రాష్ట్రపతిని అవమానించడమే : రాఘవులు

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన విషయంలో శాసనసభలో చర్చించి అభిప్రాయం పంపాలని.. బిల్లు పంపితే అసమగ్రంగా ఉందని వెనక్కి రప్పించుకోవాలన ప్రధాన పార్టీల నేతలు రాష్ట్రపతిని కోరడం అతడ్ని అవమానించడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు వ్యాఖ్యానించారు. శాసనసభలో సానుకూల, వ్యతిరేక అభిప్రాయాలపై నిష్పక్షపాతంగా చర్చించి తమ మనోగతాన్ని రాష్ట్రపతికి తెలియజేయాలని ఆయన గుంటూరులో అభిప్రాయపడ్డారు. నగరంలో రెడ్డి పాలెం వద్ద కొత్తగా నిర్మించిన పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌ను రాఘవులు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నాటకీయత ప్రదర్శిస్తూ ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచూస్తోందని దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *