Tuesday, 3 November 2026

రాఘవ ఫౌండేషన్‌ రెండో చెస్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : రాఘవ ఫౌండేషన్‌ రెండో చెస్‌ టోర్నమెంట్‌ నారాయణగూడలోని సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఏపీ చెస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కన్నారెడ్డి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల పట్ల అవగాహన పెంచేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల్లో మేథో సంపత్తిని వెలికితీయడంతో పాటు గ్రామీణ విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ టోర్నమెంట్‌ దోహద పడుతుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ టోర్నమెంటులో పాల్గొనేందుకు పలు జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *