Tuesday, 3 November 2026

కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదన్న అన్నా

ఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరు కాబోనని అన్నా హజారే తెలిపారు. తనకి ఇప్పటి వరకు ఆవ్‌ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని అందుకని తాను హాజరు కాబోవడం లేదని అన్నా తెలిపారు. అంతేకాక తన ఆరోగ్యం కూడా బాగోలేదన్నారు. కేజ్రీవాల్‌ డిసెంబర్‌ 26న రామ్‌లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతి కోరారు. అయితే ఈ తేదీ ఖరారు కావలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *