Tuesday, 3 November 2026

కెనడాలో ‘ డార్క్‌ క్రిస్మస్‌ ‘

కెనడా : కెనడాలోని క్యూబెక్‌, టొరంటో ప్రాంతాలు అమెరికాలోని మిషిగాన్‌ ఈసారి కోల్డ్‌ అండ్‌ డార్క్‌ క్రిస్మస్‌ జరుపుకొంటున్నాయి. ఇటీవల మంచుతుపాను బారిన పడ్డ ఈ ప్రాంతంలో ఇంకా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించలేదు. కరెంటు, నీరు, వెచ్చదనం… ఏమీ లేకుండా ఈసారి క్రిస్మస్‌ గడపవలసి వస్తోందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు పునరుద్ధరణకి కొన్ని చోట్ల గురువారం వరకూ, కొన్ని చోట్ల వారాంతం వరకూ సమయం పట్టవచ్చని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *