గుల్బర్గాలో ఈసారి ‘వైట్‌ క్రిస్మస్‌ ‘

జమ్మూకాశ్మీర్‌ : జమ్మూకాశ్మీర్‌లో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం గుల్మార్గ్‌లో ఈసారి పర్యాటకులు వైట్‌ క్రిస్మస్‌ జరుపుకొంటున్నారు. మంచుతో పరిసరిలన్నీ తెల్లగా మారిపోవడంతో వారీ వేడుకు వైట్‌ క్రిస్మస్‌ అని పేరు పెట్టుకున్నారు. గుల్మార్గ్‌లోని చారిత్రక చర్చి మంచుపూతతో తెల్లగా మెరిసిపోతోంది. స్కీయింగ్‌కి పేరొందిన ఈ ప్రాంతమంతా తెల్లని దుప్పటి పరిచినట్లు మంచు పేరుకుపోవడంతో సందర్శకులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తాము బస చేసిన చోట కేకు కట్‌ చేసి ఆ తర్వాత మంచుతో ఆడుకోవడం, బోలెడన్ని ఫోటోలు దిగడమే ఈ సారి తమకు క్రిస్మస్‌ పండగని వారు సంబరంగా చెప్తున్నారు.