Tuesday, 3 November 2026

వివేకనంద ట్రస్టు ఆధ్వర్యంలో వాజ్‌పేయి జన్మదినం

హైదరాబాద్‌ : మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి 89వ జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లో స్వామి వివేకానంద ట్రస్టు ఘనంగా నిర్వహించింది. సనత్‌ నగర్‌ హిందూ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు సిక్కిం మాజీ గవర్నర్‌ రామారావు, భాజపా జాతీయ ఉపాధ్యాక్షుడు బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హిందూ పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పేదరిక నిర్మూలన, నదుల అనుసంధానం, రైతు సంక్షేమం ఆశయంగా వాజ్‌పేయి ఎంతో కృషి చేశారని దత్తాత్రేయ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *