Tuesday, 3 November 2026

సమైక్యరాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజనకు నిరసనగా నెల్లూరులో రాష్ట్ర పరిరక్షణ సమితి నేతలు ఆందోళన చేపట్టారు. ఎన్జీవో కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన క్రిస్‌మస్‌ పండుగను విభజన నేపథ్యంలో ఎంతో బాధతో జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొందని పరిరక్షణ సమితి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *