హైదరాబాద్ : సీమాంధ్ర ప్రజల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అమలాపురం ఎంపీ హర్షవర్ధన్ ఆరోపించారు. ఏపీ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ద ప్రెస్’ లో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన అంశాన్ని కేబినెట్ భేటీలో టేబుల్ ఐటంగా పెట్టడం తమను తీవ్రంగా కలచివేసిందని హర్షకుమార్ అన్నారు. ప్రజల ఆందోళన దృష్ట్యా స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా చేసినట్లు చెప్పారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ప్రభుత్వమే మిత్ర పక్షాలను ప్రోత్సహించిందని ఆరోపించారు. సీమాంధ్రలో నాయకుడు లేకుండానే ప్రజా ఉద్యమం నడిచిందన్నారు. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌లు మీట్ ద ప్రెస్‌లో పాల్గొన్నారు.




