హైదరాబాద్ : తూర్పు గోదావరి జిల్లా తేటగుంట ఆర్టీఏ చెక్‌పోస్ట్ పై అధికారులు మరోసారి దాడి చేసి రూ.1.25లక్షల లెక్కతేలపని సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 20న దాడి చేసిన ఏసీబీ అధికారులు రూ. 85వేలు అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకుని పలువుర్ని అరెస్టు చేసినా అధికారుల తీరులో మార్పు రాలేదు. ఏలూరు రేంజి డీఏసీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.




