హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రైలు ప్రమాదాలను అరికట్టలేని కేంద్ర రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో సమైక్యాంధ్ర రాజకీయ ఐకాస ఆందోళన చేపట్టింది. ఆర్టీసీ కాంప్లెక్స్ డురజాడ విగ్రహం వద్ద రైలు బొమ్మలు, రైలు ప్రమాద చిత్రాలను పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మల్లికార్జున కార్గె దిష్టిబొమ్మను దహనం చేశారు.




