Tuesday, 3 November 2026

పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్లు

హైదరాబాద్‌ : కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా పై పోలీసుల, అటవీ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఇటీవల ఎర్రచందనం దొంగలు అధికారులపై దాడి చేసి హతమార్చడంతో అడవుల్లో కూబింగ్‌ను ముమ్మరం చేశారు. తమిళనాడు నుంచి ఇక్కడకు వస్తున్న ఎర్రచందనం కూలీలలపై దృష్టి సారించారు. గతరెండు రోజులుగా అధికారులు చేపట్టి కూంబింగ్‌లో కడప జిల్లా రాజంపేట పోలీసులకు 48 మంది స్మగ్లర్లు పట్టుబడ్డారు. నిందితుల నుంచి ఎర్రచందనం దుంగలు, వారు ఉపయోగించే గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *