Tuesday, 3 November 2026

6 గగంటలు పని… 9 మంది బదిలీ… సీఎంగా కేజ్రీవాల్‌ తొలిరోజు

ఢిల్లీ : ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా నిన్న పదవీ ప్రమాణం చేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌ తొలిరోజు ఆరుగంటలు కార్యాలయంలో గడిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిన వెంటనే 1.30కి కార్యాలయానికి వెళ్లిన ఆయన 7.30 గంటల వరకూ అక్కడ గడిపారు. ఢిల్లీ జలమండలి సీఈవో సహా 9 మంది అధఙకారులను బదిలలీ చేశారు. శనివారం సెలవు దినమైనా కొత్త ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఢిల్లీ సచివాలయ సిబ్బంది అంతా ఉద్యోగాలకు వచ్చారు. ఇప్పటి వరకూ ఇక్కడ వారానికి ఐదు రోజజుల పని దానాల విధానం ఆచరణలో ఉంది. కేజ్రీవాల్‌ దానిని ఆరురోజుల పనిపనిదినాలుగా మారుస్తారని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *