హైదరాబాద్ : రాష్ట్ర విభజన బిల్లు ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉందని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు విమర్శించారు. బిల్లుపై సమగ్రమైన చర్చ జరగాలన్నా… సరైన వివరాలు లేకుంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఆక్టిక్ 3 ప్రకారం ఇంత వరకు దేశంలో ఏ రాష్ట్ర విభజన జరగలేదని. కాంగ్రెస్ రాజకీయ అవసరం కోసం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఆ పార్టీకి నూకలు చెల్లడం ఖాయమని ఆయన గుంటూరులో వ్యాఖ్యానించారు.




