Tuesday, 3 November 2026

‘ఏది నీతి ఏది రీతి’ పుస్తకావిష్కరణ

హైదరాబాద్‌,సోమాజిగూడ :హేతువాదంపై హేతువాద రచయిత ఎస్‌. ఇన్నయ్య రాసిన ‘ఏది నీతి ఏది రీతి’ అనే పుస్తకాన్ని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ ఆవిష్కరించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో దీపిక పబ్లికేషన్స్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ హేతువాద సాహిత్యం ఈ సమాజానికి చాలా అవసరమన్నారు. సమాజంలో ఇంకా అవిద్య అధికంగా ఉందని, ఆ దిశగా అభివృద్ది జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పుస్తకం హేతువాద ఉద్యమానికే కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడుతుందన్నారు. ఇందులోని వ్యాసాలు శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేలా ఉన్నాయని, అందరూ చదవాలని, ఇలాంటి మరికొన్ని పుస్తకాలు రావాలని జేపీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ హేతువాద ఉద్యమానికే కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడుతుందన్నారు. ఇందులోని వ్యాసాలు, శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేలా ఉన్నాయని, అందరూ చదవాలని, ఇలాంటి మరికొన్ని పుస్తకాలు రావాలని జేపీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ హేతువాద వేదిక కార్యదర్శి ఇస్నాక్‌ మురళీధర్‌, లోక్‌సత్తా ప్రతినిధి హైమాప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *