Tuesday, 3 November 2026

ద్రవిడ్‌ రికార్డును అధిగమించిన కలిస్‌

డర్బన్‌ : దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ కలిస్‌ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్‌మెన్‌గా నిలిచాడు. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టుతో టెస్టుల నుంచి రిటైర్‌ కాబోతున్న కలిస్‌ మెత్తం 13,289 పరుగులతో ఇప్పటి వరకూ అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ద్రవిడ్‌ను అధిగమించాడు. గత ఏడాది టెస్టులకు వీడ్కోలు పలికిన ద్రవిడ్‌ 164 టెస్టులు ఆడి 13,288 పరుగులు చేశాడు. ఈ జాబితాలో 15,921పరుగులతో సచిన్‌ మొదటి స్థానంలో ఉండగా, పాంటింగ్‌ 13,378పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *