Monday, 2 November 2026

అధికారులు బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని నిషేధించిన చైనా

బీజింగ్‌ : అధికారులు ఏవరూ బహిరంగంగా పొగ తాగరాదని చైనా ప్రభుత్వం ఆదేశించింది. 2011లో చైనా వైద్య ఆరోగ్య శాఖ ప్రజలు ఎక్కువగా ఉండే రెస్టారెంట్లు తదితర ప్రాంతాల్లో పొగతాగడంపై మార్గనిర్దేశకాలు విధించింది. అయితే 300 మిలియన్ల మంది పొగతాగే వారు ఉన్న చైనాలో నియమాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో తాజాగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పొగతాగడంపై ఉన్న ఆంక్షల అమలులో ప్రభుత్వ అధికారులే చొరవ తీసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ప్రభుత్వం కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *