Monday, 2 November 2026

తెలంగాణ బాగు కోసం కేసీఆర్‌ చేసిన ఒక్క మంచి పని చెప్పాలి: తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి

హైదరాబాద్‌ : కేసీఆర్‌ తన జీవిత కాలమంతా అందరినీ తిడుతూనే ఉంటారని, తెలంగాణ బాగు కోసం చేసిన ఒక్క మంచిపనిని కేసీఆర్‌ చెప్పాలని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. తన రాజకీయాల వల్ల తెలంగాణలో ఎందరు అనాథలయ్యారో కేసీఆర్‌ చెప్పాలన్నారు. ఆయన కుటుంబసభ్యులంతా చల్లగానే ఉన్నారన్నారు. ప్రతి ఏడాదీ ఆస్తులు బహిరంగంగా ప్రకటిస్తున్న ఏకైక నాయకుడు దేశంలో చంద్రబాబు ఒక్కరేనని, జనవరి 3న ఆస్తులు ప్రకటిస్తానని బొత్స అంటున్నారని, బినామీల ఆస్తులు ప్రకటిస్తారా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఎంత మంది బినామీల ఆస్తులను బొత్స ప్రకటిస్తారో చూస్తామన్నారు. బొత్స సొంత జిల్లా విజయ నగరంలోనే ఆయన పై ప్రజలు తిరగబడ్డారని, బొత్స అక్రమ ఆస్తులపై ప్రజలు తిరగబడితే సైనికులను కాపలా పెట్టుకోవాల్సి వచ్చిందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మాత్రం ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *