Tuesday, 3 November 2026

రవీంద్ర భారతిలో ‘శకుంతల’ పద్యనాటకం … వీక్షించండి

రవీంద్రభారతి: పద్మభూషణ్‌ ఎ. ఆర్‌. క్రిష్ణ 88వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ థియేటర్‌ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు ఘనంగా జరిగాయి. వీటిలో భాగంగా మహాసాధ్వి శకుంతల పద్య నాటకాన్ని కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ఏలూరుకు చెందిన హేలాపురి కల్చర్‌ అసోసియేషన్‌ కళాకారులు ఆ నాటకాన్ని రక్తి కట్టించారు. గేదెల రామారావు రచించిన ఈ నాటకానికి కాజావలి దర్శకత్వం వహించారు. చక్కటి పద్యాలాపన, రసానుభూతిని ఉల్పించే రీతిలో సన్నివేశాలు ప్రేక్షకులను మైమరపించాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *